ఓ చిరుగాలి . . . ! ! !
నీ అల్లరి పనుల్లో ఏదంటే నీకు మక్కువ ? ? ?
ఏడుకొండలమీద ఆ దేవదేవునికి చామరాలు వీయడమా
లేక ఆ దేవదేవుని ఘంటానాదంతో ఇహలోకానికి స్వాగతించడమా
అయినవారందరినీ చల్లగా స్పృశించి పలుకరించడమా
లేక కొత్తవారిని సైతం సుమసౌరభాలతో నిలిపివెయ్యడమా
ఏ పని లో ఉన్నా, నేనున్నానంటూ గాలివాటంగా ఎదురొస్తావు
ఏమీ తోచక ఊరుకుంటే, నీ గాలికబుర్లతో జతకడతావు
అందమైన మూగ విరులకి సైతం నీ తాకిడితో కదలిక అనే భాషనందించావు
నిర్జీవమైన వెదురుని సైతం నీ చేరికతో వేణువుకి పోటీగా నిలుపుతావు
ఒంటరితనం నాకిష్టమా అని అందరికీ తీరని అనుమానం
కాదు, ఏకాంతం ఈ చిరుగాలి ఊసుల తోడు నాకిష్టం
మాట లేకున్నా నువ్వు చేరవేసే ఆ దైవ సందేశం నాకు ప్రియం
మనసు తిమిరాన్ని చెరిపేసే నీ చెలిమి నాకు ఆహ్లాదం
వినగల చెవులు మనిషికి లేకున్నా మనసుకి అవసరం
ప్రకృతి చెప్పే ప్రతి సూచన గ్రహించగలగడం ఒక అదృష్టం
స్థాయి దాటి గోల హెచ్చుమీరడం జీవనంలో నీ ఉనికంత సహజం
ఆ సమయాన మనసు మాత్రమే వినగలిగే నీ మౌనరాగం ఒక వరం . . . ! ! !
తిరుమలలో దూరంగా కనిపించే గోపురం, మంద్రంగా వినిపించే ఘంటానాదం, తన్మయత్వంతో ఊగుతూ ఆ అనంతునికి చామరాలు వీస్తున్నాయా అనిపించే ఆ ఏడుకొండల మీదున్న వేలవేల వృక్షాలు....అలాంటి ఒక సాయం సమయాన, వాటన్నిటి వెనకాల నేను, నా కలం ! ! !
I felt the God's presence much more at that time than I could ever feel in the sanctum. These lines were my foremost thoughts and did not feel like editing as this was what I exactly felt and dint want to spoil my salutations to God !!!!!
This , I was influenced by Tagore's 'my song' poem.
He can frame his unique thoughts and feelings in a most admirable, apt , excellent and touchy fashion....
Here goes his lovely poem :
This song of mine will wind its music around you,
my child, like the fond arms of love.
The song of mine will touch your forehead
like a kiss of blessing.
When you are alone it will sit by your side and
whisper in your ear, when you are in the crowd
it will fence you about with aloofness.
My song will be like a pair of wings to your dreams,
it will transport your heart to the verge of the unknown.
It will be like the faithful star overhead
when dark night is over your road.
My song will sit in the pupils of your eyes,
and will carry your sight into the heart of things.
And when my voice is silenced in death,
my song will speak in your living heart.
WOW !!!!!!!!!! over and over again, I salute .