బాల్యం... భగవంతుని అందమైన అపురూపవరం
లోకం తెలియని అమాయకత్వమే పోతపోసిన బంగారం
కపటం కలవరం కల్లోలం కల్మషం జాడలెరుగని కలల కపోతం
ఇంట, చిట్టి మహారాణిలా ఏలిన కమనీయ ఙ్ఞాపకం
బడిలో తొలి అడుగుతో, బాహ్యప్రపంచపు తడబాటు పరిచయాలు
ఆటలతో ఆనందాలు,స్నేహితులతో సంతోషాలు,చదువుల సంకటాలు
తప్పొప్పులు, బుద్ధులు, కొత్త విషయాల గురించి ఆత్రపు సందేహాలు
వ్యక్తిగా నిలిచే క్రమంలో, చిన్ని పాదాలు ఆందోళనతో వేసే అడుగులు
ఇంటిగూడు వదలి, పైచదువులకై సంశయపు ప్రయాణం
ఇమడలేక మరలిరాలేక ఆదిలో ఆవేదన పడిన వైనం
మంచి స్నేహితులని మించిన ఆలంబన లేదన్న నిజం
విలువగల వ్యక్తిత్వం కన్న...భద్రత లేదన్న నిష్టుర సత్యం !!!
అప్రమేయంగా ఎదుర్కోవాల్సివచ్చిన చేదు సంఘటనలు
నాకే ఎందుకని చింతపడిన చిన్న చిన్న సంఘర్షణలు
మనిషిగా మల్చబడే క్రమంలో అవి మన(సు) అలజడులు
సరియైనబాటలో నిశ్చలంగా సాగడానికి ఉండాల్సిన గట్టి పునాదులు
ఆ పునాదులపై, ఒక్కొక్క ఇటుకగా నిలిచే ప్రతీ జీవనక్షణం
ఆ నిర్మాణం దేదీప్యంగా సాగడానికి, అనుభవాలు అవసరం
ఏం జరిగినా, ఏదో కారణానికి లోబడి అన్న అచంచల విశ్వాసం
ఆ విశ్వాసం యదార్ధం కావడం, కాలునిలువని కాలమంత ఖచ్చితం
ఆ సరళమైన విషయం అర్ధం కావడమే గగనం
ఆ ఆశావహ దృక్పధం అలవడిన సమయం, ఆ నిముషం
నా మనసు మరల మారని శాంతి కపోతం
పూదోట మాత్రమే..... నా మనః పయనం !!!!!
Accidentally stumbled by your blog. Very few people can write equally convincingly in two languages. You write well. Just a couple of minutes back saw someone else on blogspot write equally well in both Telugu and English. Amazing! We have so many good writers. Internet has revolutionized the way we express ourselves.
ReplyDeleteThanku sir....
ReplyDeleteDon't feel like addressing u by ur chosen name as ur profile definitely does not suggest that :)
Once again thank you.
మీ ఐడియాస్ నావీ కొన్ని కొన్ని మ్యాచ్ అవుతున్నయి . మీ మన: పయనం ఒక పూదోట ప్రయాణం .. మీ బాల్యం నుంచీ ఇలా డాక్టర్ అయ్యే వరకూ మొత్తం మీ పరిణతి ప్రతిబించింది
ReplyDeleteఅవును, మీ కవితలు చదివాక నేను కూడా అదే అనుకున్నాను :)
ReplyDeleteథాంక్స్ ఆనంద్ గారు !!!