Sunday, November 7, 2010

విరి......


అందం అంటే ? ? ? ?
మల్లె లాంటి మనసుది
మకరందం వంటి మాటది
కలువ కన్నులది
పాద పద్మములది

ఆ అందమే వరించిన
ఈ అల్పాయుష్క విరులను గని
చలించే మనసులారా
నా సాటి ఎవరో అవలోకించండి. . . . . .

నేనే. . .
సంధ్యారవికిరణ వర్ణాన్ని తోసిరాజనే కనకాంబరం
శశాంక వర్ణాన్ని నింపుకున్న మల్లి
కుంకుమతో పోటీ అనే మందారం
ఇంతికురుల సిరుల పంట కుసుమం
ఆర్ద్రతతో దరిచేరిన తుమ్మెదకు
తేననిచ్చి ఆకలిదీర్చే సుమం

ముళ్ళ బాటలో వికసించగల ధైర్యం
కుళ్ళిన త్రోవలో గుభాలించగల నైజం
గుండెల్లో గునపాలు దిగినా చెరగని హాసం
చిన్నదైనా స్పూర్తి నివ్వగల జీవితం...
నా సొంతం !!!!

అమరవీరుల ఆత్మాంజలికి
జీవితమే అర్పణ చేసే జీవం
సున్నిత మానసినైన నేనే ఆ విరి
కానరాదు సాటి అయిన ఏ సిరీ. . . . . .

No comments:

Post a Comment