Sunday, November 7, 2010

నీలి మేఘం . . . !!!


నీలాకాశమే అంతులేని చిత్రపటంగా
తనకు తానే వర్ణంగా
అందమైన చిత్రాలు గీసే అందం
కనుల వాకిటి రూపం- ఆ నీలి మేఘం

తెలుపు నలుపు రంగుల ద్వయ సౌందర్యాన్ని ఆవిష్కరించి
లోతు తెలిసి భావాన్ని చూడగల కళ్ళకు అద్భుతాలను చూపిస్తుంది
అటూఇటూ తిరుగాడుతూ, చిత్రాలను మార్చి
స్పందించగల మన ముందు కోరుకున్న రూపాన్ని నిలబెడుతుంది

మల్లెపువ్వులా తేలినా తానే
కారుమబ్బులా నిలిచినా తానే
ప్రేమగా కరిగి వర్షించినా తానే
భీకరంగా గర్జించినా తానే

అంతులేని ఆనందం అంటే తనలో తేలియాడడమే అంది
తాను లేని వర్షపు చినుకు ఉనికేదని ప్రశ్నించింది
అంతలో కొత్త చిత్రాలు చేయడానికి బయలుదేరింది
ఆ అద్భుతాలతో తొలకరి జల్లుగామారి పలకరిస్తుంది

అలా తన గమ్యం లేని గమనంలో
ఎంత కాలమైనా అలుపు లేని పయనం సాగిస్తుంది
తనలా సృజనకు మెరుగులద్దడంలో
తన సాటి ఎవరో వెతుకుతూ ముందుకు సాగుతుంది - నీలి మేఘం

2 comments:

  1. దివ్య గారు : మీలాగా నచ్చిన లైన్స్ కోట్ చేద్దామంటే ..మొత్తం కాపీ పేస్ట్ చేయాలేమో బాగోదుగా :) :) ...ఒవెరల్ల్ చాలా బాగుంది ప్రతీ లైన్ లో డెప్త్ ఉంది నాకు నచ్చింది

    ReplyDelete
  2. చాలా థాంక్స్ ఆనంద్ గారు :)

    ReplyDelete