Sunday, November 7, 2010

కల...!!!


నా ప్రియసఖి ప్రేమనే మేఘాల మీద కలలసౌధంలో విహరిస్తోంది
అది వాస్తవం కావాలని ఆరాటపడుతోంది
అదే తన ఆశ
ఆ ఆశ తీరాలని నా అభిలాష

అతని గొంతు విన్న తన మోము
వసంత సంధ్యాసమయాన కోకిలగొంతు విన్న పసిదాని మోమే
అతని రూపం చూసిన మరుక్షణం
ఆమె నయనద్వారాలు తమ ఉనికిని కోల్పోతాయేమో
తన నోటి వెంట పలికే కవిత
అతని పేరేనేమో
ఆలోచనల్లో జీవితకాల బంధీని చేసింది
కల కల్ల కాకూడదని ఆరాటపడుతోంది
అదే తన ఆశ
ఆ ఆశ తీరాలని నా అభిలాష

అనూహ్యంగా ఎదురైన విషవలయం
బయటపడాలనే తన ప్రయత్నం
ఎదురైన అర్ధం లేని కక్ష
రూపుమారాలని తన ఆకాంక్ష
ఆరటం లేని ఆనందం
తన సొంతం కావాలని నా అభిమతం
అదే తన ఆశ
ఆ ఆశ తీరాలని నా అభిలాష.

I wrote this about a friend of mine and best thing is that she got happily married to her friend... :)))
GOD bless them .

2 comments: