Sunday, November 7, 2010

విషాదం...!!!


దానికి రూపం లేదు, కాని
నగుమోము రూపును మాయం చేయగలదు
రంగు చెప్ప సాధ్యం కాదు, కాని
మనసంతా తిమిర వర్ణాన్ని నింపగలదు

విషాదానికి కళ్ళు లేవు, కాని
సజల నయనాలను సృజించగలదు
ముట్ట సాధ్యం కాదు, కాని
స్పృశించకుండానే అనుభవింపజేయగలదు

ఏది ఉన్నా లేకున్నా, ఉన్నది మాత్రం
అంతులేని లోతు, అగాధం
అందరూ కోరే అపురూప వరం
ఆ అగాధం లో పడని జీవితం

ఖేధం లేకపోతే మోదం విలువ చిన్నబోతుంది
అందుకే శాపం కాని విషాదం కూడా ఒక వరం
శాపగ్రస్తమైన విషాదాన్ని సైతం
ఎదిరించగల ధైర్యం మరింత గొప్ప వరం.............

I was disturbed by a patient's plight and wrote this more than a year ago...!!!

No comments:

Post a Comment